Gossipsఇది తెలిశాక ఎన్.టి.ఆర్ గ్రేట్ అని అనకుండా ఉండలేం..!

ఇది తెలిశాక ఎన్.టి.ఆర్ గ్రేట్ అని అనకుండా ఉండలేం..!

హరికృష్ణ మరణంతో ఎన్.టి.ఆర్ ఎలాంటి మానసిక ఆవేదన చెందుతున్నాడో అందరు అర్ధం చేసుకోగలం. తనకంటూ ఓ గుర్తింపు ఇచ్చిన నాన్న ఇప్పుడు తన వెంట లేడన్న బాధ క్షణ క్షణం ఎన్.టి.ఆర్ ను వెంటాడుతుంది. అయితే మనుషులు శాస్వతం కాదు అందుకే బాధ దిగమింగుకుని చేయాల్సిన పనుల గురించి ఆలోచించాలి.
1
తండ్రి మరణంతో గుండె నిండా బాధతో ఉన్న ఎన్.టి.ఆర్ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి షూటింగ్ కు సై అని చెప్పాడట. బాధ ఉన్నా సరే నిర్మాతకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ నటిస్తున్న అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేశారు.
5
అందుకే మరో వారం రోజులు షూటింగ్ చేయాల్సి ఉందట. దానికోసం ఎన్.టి.ఆర్ సిద్ధమయ్యాడు. ఇంట్లో పరిస్థితి బాగా లేకున్నా సినిమా అనుకున్న డేట్ కు వచ్చేందుకు ఎన్.టి.ఆర్ షూటింగ్ కు రెడీ అయ్యాడట. ఇది తెలిసి నందమూరి ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ మీద మరింత అభిమానం పెంచుకున్నారు.
2
కళ్యాణ్ రాం కూడా గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడట. తండ్రి మరణించిన బాధ ఉన్నా సోదరిద్దరు షూటింగ్ కు రెడీ అవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news