కొన్ని సంవత్సరాల తర్వాత మాటీవీ ని నెంబర్ వన్ గా నిలిపిన ఎన్టీఆర్ అసలు పారితోషికం ఇదే !!

ntr remuneration for big boss show in star maa

విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌పై స్పష్టమైన ఫిగర్‌ బయటకు వచ్చింది. ఈ షో పది వారాల పాటు జరగనుంది. ఒక్కో వారంలో ఎన్టీఆర్‌ శని, ఆదివారాలు ఈ షోలో కనిపిస్తాడు. ఒక్కో రోజుకు ఆయన 35లక్షలు తీసుకుంటున్నాడు. అంటే ఒక వారానికి ఎన్టీఆర్‌ తీసుకునేది 70 లక్షలు. మొత్తం పది వారాలకు కలిపి ‘బిగ్‌ బాస్‌’కి ఎన్టీఆర్‌కు మొత్తంగా 7కోట్లు లభించనుంది.

ఆయనకున్న ఇమేజ్‌, స్టార్‌ మా కి ఉన్న ఆర్ధికవనరుల రీత్యా చూస్తే ఎన్టీఆర్‌ పెద్దగా ఎక్కువగా చార్జ్‌ చేయడం లేదని, మామూలు మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని అర్ధమవుతోంది. మరో వైపు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ కూడా మొదటి కంటే రోజు రోజుకీ పదునెక్కుతోంది. మొదటి రోజు కంటే తాజాగా శని ఆదివారాలలో ఆయన మాటల చాకచక్యం, వాక్పిటమ బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఓ నటునిగా అతనికి కూడా అందరి నుంచి ఇలాంటి కాప్లిమెంట్‌ తప్పించి మరేదీ పెద్దదిగా భావించడనే అంటున్నారు. స్టార్‌మా యాజమాన్యం కూడా ఎన్టీఆర్‌ క్రేజ్‌, ఇమేజ్‌, ప్యాషన్‌, ఎనర్జీలతో పోల్చుకుంటే తామిస్తోందని తక్కువే అని అంటోంది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత మాటీవీ ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపిన తారక్ కి ఎంత ఇచ్చినా తక్కువే అంటున్నారు.

Leave a comment