ఆ రికార్డు ఎన్టీఆర్ ఒక్క‌డిది మాత్ర‌మే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘జైలవకుశ’ చిత్రం మంచి సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొట్టకున్నా ఈ చిత్రం ఖాతాలో ఇప్పుడు అరుదైన రికార్డు ఒక్క‌టి చేరింది. జై ల‌వ‌కుశ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైంది.

దక్షిణ కొరియాలో జరిగే ప్రతిష్టాత్మక బుచాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జై ల‌వ‌కుశ‌ ప్రదర్శింపబడింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే వైవిధ్య‌మైన చిత్రాల‌కు ఇక్క‌డ ప్ర‌ద‌ర్శిస్తారు. ఇక బుచాన్‌లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డిన తొలి తెలుగు చిత్రంగా జై ల‌వ‌కుశ రికార్డుల‌కు ఎక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఏ తెలుగు సినిమా కూడా ప్ర‌ద‌ర్శించ‌లేదు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది కూడా పలు సినిమాలను పరిశీలించిన వారు సౌత్ ఇండియా నుండి ఏ ఒక్క సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘గల్లీ బాయ్’ కి మాత్రమే ఈ ఛాన్స్ ద‌క్కింది. ఇక జై ల‌వకుశ విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో జై, ల‌వ‌, కుశ అనే మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించాడు.

ఈ మూడు పాత్ర‌ల్లోనూ అద్భుత‌మైన న‌ట‌న క‌న‌పరిచాడు. మళ్లీ ఏ తెలుగు సినిమా బుచాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్తుందో.. ఎన్టీఆర్ రికార్డు ను టచ్ చేస్తుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది. కాని ప్రతి ఏడాది కూడా నిరాశే మిగులుతుంది.

Leave a comment