ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ముహుర్తం ఆరోజే..!

ntr-ram-charan-rajamouli

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై అందరి దృష్టి ఉంది. ఇద్దరు సూపర్ స్టార్స్ చేయబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ కల్లా ఎన్.టి.ఆర్, చరణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుంటారు. అక్టోబర్ లో ఈ సినిమా ముహుర్తం పెట్టబోతున్నారట.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను నవంబర్ నుండి మొదలుపెడతారని తెలుస్తుంది. సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి రోజుకో కథ చెక్కర్లు కొడుతుంది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి సినిమా చేయడమే సిని ప్రియులకు పండుగలాంటి వార్త. అది రాజమౌళి డైరక్షన్ లో అంటే ఇక ఆ రేంజ్ వేరేలా ఉంటుంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ లకు జోడీగా కీర్తి సురేష్, రష్మికలను సెలెక్ట్ చేశారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది.

Leave a comment