‘శాతకర్ణి’ ట్రైలర్ అదుర్స్ అంటూ బాబాయ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన తారక్..

NTR praises balayya and satakarni trailer

After a long time young tiger NTR tweeted about his babai Balayya and his prestigeous project Gautamiputra Satakarni’s trailer. Read below tweet what he said.

బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ విడుదల అవ్వడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. అతి తక్కువ సమయంలో అద్భుతమైన ఔట్‌పుట్ తీసుకురావడంపై భేష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే క్రిష్ బ్రహ్మాండమైన ట్రైలర్‌ని చూపించాడని కొనియాడుతున్నారు. ఇక బాలయ్య ఎప్పటిలాగే రౌద్రుడిలా రెచ్చిపోవడం, తన మార్క్ డైలాగులతో గర్జించడాన్ని చూసి.. ప్రతిఒక్కరూ పూనకంతో ఊగిపోతున్నారు. ఇలాంటివారి జాబితాలో తానూ ఉన్నానంటూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

‘శాతకర్ణి’ ట్రైలర్‌ని చూసి ఎగ్జైట్ అయిన తారక్.. చిత్రబృందం, తన బాబాయ్‌పై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ‘‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ మామూలుగా లేదు. బాబాయ్ అదరగొట్టేశాడు. నందమూరి బాలకృష్ణని ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా చూపించినందుకు క్రిష్ టీంకి వందనాలు’ అంటూ ట్వీట్ చేశాడు. చాలాకాలం తర్వాత తారక్ తన బాబాయ్‌ గురించి కొనియాడుతూ ఇలా ట్వీట్ చేయడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఒక్క ట్వీట్ చాలు.. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని! ఓవైపు బాలయ్య ‘శాతకర్ణి’ ట్రైలర్‌తో, మరోవైపు తారక్ తన ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి చరిత్రలో నిలిచిపోయే గొప్ప గిఫ్ట్ ఇచ్చారు.

 

Leave a comment