రిలీజ్ డేట్ పై ట్విస్ట్ ఇచ్చిన ‘ఎన్టీఆర్’ మహానాయకుడు..

55

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ పై అందరి అంచనాలు పెరుగుతున్నాయి. నందమూరి బాలయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మొదటి భాగానికి కథానాయకుడు, రెండో భాగానికి మహానాయకుడు పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని జనవరి 09 న , రెండో భాగాన్ని జనవరి 25 న విడుదల చేయాలనీ ముందుగా అనుకున్నారు. అయితే అనుకున్నట్లే మొదటి భాగాన్ని పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేస్తున్నారు.

కానీ రెండో భాగం మాత్రం అనుకున్న సమయానికి రావడం లేదు. అయితే రెండు భాగాల మధ్య రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉండటంతో, గిట్టుబాటు కాదనే అభిప్రాయాన్ని బయ్యర్లు వ్యక్తం చేశారట. దాంతో ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ విషయంలో నిర్మాత బాలకృష్ణ ససేమీరా అన్నా … బయ్యర్ల ఒత్తిడితో తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

Leave a comment