Gossipsబాలయ్య సంచలన నిర్ణయం.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' కి బ్రేక్..!

బాలయ్య సంచలన నిర్ణయం.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కి బ్రేక్..!

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై పోస్టర్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి. ఎన్.టి.ఆర్ కథానాయకుడు అనుకున్న విధంగా జనవరి 9న రాబోతుందని తెలుస్తుంది. అయితే కొద్దిపాటి గ్యాప్ తోనే జనవరి 24న ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్ చేశారు.

అయితే ఎన్.టి.ఆర్ రెండో పార్ట్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా చర్చలు జరుపుతున్నాడట. అంతేకాదు వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ జనవరి 24న రిలీజ్ ఫిక్స్ చేశాడు. ఎన్.టి.ఆర్ మహానాయకుడు వాయిదాకు ఇది కూడా ఓ ప్రధాన కారణమని తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. విద్యా బాలన్, రానా, కళ్యాణ్ రాం, సుమంత్, రకుల్, తమన్నా వంటి స్టార్స్ అంతా ఈ బయోపిక్ లో భాగమవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news