Gossipsఫ్రీ టికెట్లు… ప‌రువు తీయ‌డానికా..?

ఫ్రీ టికెట్లు… ప‌రువు తీయ‌డానికా..?

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ పాత్రలో నటించారు. అయితే కథానాయకుడు సినిమా రిలీజ్ ముందు కాస్త హంగామా ఏర్పడగా ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. కథానాయకుడు టాక్ బాగా వచ్చినా సినిమా ఫలితం తేడా కొట్టింది. ఇక మహానాయకుడు పరిస్థితి అయితే మరీ దారుణం.

ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానంతో వచ్చిన మహానాయకుడు సినిమా బాలకృష్ణ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. పెద్దాయన బయోపిక్ అని తీసిన ఈ సినిమా ఇంత ఘోరంగా విఫలమవడం అందరిని షాక్ అయ్యేలా చేసింది. అయితే రిలీజై వారం రోజులు కూడా కాని ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఏపిలో మహానాయకుడు సినిమాకు టిడిపి నేతలు టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారట. ఆల్రెడీ డ్వాక్రా మహిళలకు ఫ్రీ షో వేస్తున్నారని తెలుస్తుంది.

ఇలా ఫ్రీ షో వేయడం వల్ల పరువు తీసినట్టు అవుతుందని కొందరి వాదన. అయితే ఈ విధంగా పబ్లిసిటీ కూడా వస్తుందని కొందరు టిడిపి నేతలు ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా బాలయ్య కెరియర్ లో ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోతుందని భావించగా చేదు జ్ఞాపకంగా మిగిలేలా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news