Gossips‘మహానాయకుడు’ముంచుతాడా..తేలుస్తాడా!

‘మహానాయకుడు’ముంచుతాడా..తేలుస్తాడా!

ఈ మద్య టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలు బాగానే వస్తున్నాయి. మహానటి తర్వాత మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్ బయోపిక’నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చారు. ప్రమోషన్ కూడా భారీ ఎత్తున చేశారు.

తీర థియేటర్లో రిలీజ్ అయ్యాయి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో అంతా పాటలు, అర్థం పర్థం లేని సన్నివేశాలు తప్ప ఏమీ లేదని ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎంతో భారీ అంచనాలు వేసుకున్న నందమూరి ఫ్యాన్స్ బాగా నిరాశ చెందడంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. దాంతో నిర్మాతలకు బాగానే గిట్టు బాటు అయినా..బయ్యర్లు మాత్రం భారీ నష్టాలకు గురయ్యారు. దాంతో బాలకృష్ణ నష్టపోయిన బయ్యర్లకు కొంత ఊరట ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పడు అందరి దృష్టి ఎన్టీఆర్ మహానాయకుడు పైనే ఉంది.

మొదటి భాగంలో చేసిన తప్పుడు రెండో భాగంలో లేకుండా చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకర్షించే విధంగా ఉన్నా ట్రైలర్ పై పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని పోతే దానికి తగ్గ ఫలితం ఉంటుందా లేదా అన్న ప్రశ్న ప్రేక్షకులకు కలుగుతుంది. మరోవైపు వైఎస్సార్ బయోపిక్ గా వచ్చిన యాత్ర సూపర్ హిట్ అయ్యింది. ఈ సమయంలో మహానాయకుడు బాలయ్యను ముంచుతాడా..తేలుస్తాడా చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news