ఎన్టీఆర్ ని టచ్ చేయలేకపోయిన అజ్ఞాతవాసి

ntr and pavan kalyan
పవన్ త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్ బీభత్సం సృష్టిస్తున్నా ఒక్క ఏరియాలో మాత్రం ఎన్.టి.ఆర్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన జనతా గ్యారేజ్ నైజాం లో మొదటి రోజు 5.51 కోట్ల కలక్షన్ సాధించగా అంతకంటే భరీ రేంజ్ లో వచ్చిన అజ్ఞాతవాసి 5.4 కోట్ల వసూళ్లనే రాబట్టిందని టాక్.
రెండేళ్ల క్రితంతో పోల్చితే టికెట్ రేటు హైక్ ఇంకా థియేటర్ కౌంట్ కూడా భారీ తేడా ఉంది. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎన్.టి.ఆర్ రికార్డ్ ను టచ్ చేయలేదని అంటున్నారు. ఎవరి స్టార్ ఇమేజ్ ను బట్టి క్రేజ్ ఉన్నా కలక్షన్స్ మాత్రం ఎన్.టి.ఆర్ రికార్డును దాటకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే మిగతా ఏరియాల్లో మాత్రం అజ్ఞాతవాసి ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి కొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఓవర్సీస్ లో మాత్రం అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజే 1.5 కలక్షన్స్ కొల్లగొట్టాడు. అక్కడ 3 మిలియన్ కలక్షన్ సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
అజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్.. పవర్ స్టార్ స్టామినా ఇది..!

Leave a comment