కూల్ అండ్ క్లాస్ లవ కుమార్ వచ్చేసాడు..ఎన్టీఆర్ స్మార్ట్ లుక్ అదుర్స్…

jai lava kusa second role ntr

జై లవ కుశ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా జై క్యారెక్టర్ కు సంబంధించిన తొలి టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి.

తాజాగా సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న మరో క్యారెక్టర్ లవ కుమార్ కు సంబంధించిన లుక్ ను రాఖీ సందర్భంగా ఈ రోజు (సోమవారం) రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కూల్ అండ్ క్లాస్ గా కనిపిస్తున్న ఈ లుక్ చూస్తుంటే ఇదే హీరో క్యారెక్టర్ అని అర్థమవుతోంది. జై క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో రావణుడిగా కనిపిస్తే, లవ కుమార్ క్యారెక్టర్ సెటిల్డ్ గా రాముడిలా కనిపిస్తొంది. త్వరలో మరో క్యారెక్టర్ కుశ కుమార్ సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

DGmkYbGVwAAI3uO (1)DGmiAD_VwAAnuvn

Leave a comment