చరణ్ రంగస్థలంలో ఆ మహా నటుడు..!

ram-charan-rangasthalam-sen

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు సినిమాలో అన్న నందమూరి తారక రామారావు ప్రస్థావన ఉంటుందని అందరు అంటున్నారు. సినిమా మొత్తం 1985 ఇయర్ నేపథ్యంతో సాగుతుందని తెలిసిందే. కాబట్టి సినిమాలో రాజకీయ ప్రస్థావనలో భాగంగా ఎన్.టి.ఆర్ గురించి రంగస్థలంలో ఉంటుందని అంటున్నారు.

ఈ వార్తలపై నిజం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మార్చి 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా చరణ్ కు కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. పూర్తి మేకోవర్ తో మెగా అభిమానులను అలరించేందుకు వస్తున్న చరణ్ అందుకు తగిన హిట్ అందుకుంటాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్, బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా జిల్ జిల్ జిగేల్ అని పెట్టబోతున్నారట. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బోయపాటి మార్క్ సినిమాగా ఇది ఉంటుందట.

Leave a comment