రావణుణ్ణి వరించిన “ఆ ప్రతిష్టాత్మక అవార్డు”.. ఇక క్యూ మొదలు !!

jai-lavakusa-ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కె.ఎస్ రవింద్ర (బాబి) డైరక్షన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా తారక రాముడి నట విశ్వరూపం ఏంటో చూపించింది. నటనలో తనని మించి వారు ఈ తరంలో లేరని జబ్బచరిచి తన అభిమాని ప్రతి ఒక్కరు చెప్పుకునేలా నటించడం కాదు కాదు జీవించే నటనకు పరిపూర్ణత తెచ్చే హీరో ఎన్.టి.ఆర్.

ఇక ఈ సినిమా వసూళ్ల హంగామాకు బాక్సీస్ షేక్ అవగా ఇప్పుడు అవార్డుల పంట పండింది. 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సెలెక్ట్ అయ్యాడు. జూన్ 16న హైదరాబాద్ నోవాటెల్ లో జరిగే వేడుకలో ఈ అవార్డ్ అందుకోనున్నాడు ఎన్.టి.ఆర్.

2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లకు కాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అందుకున్న తారక్ మళ్లీ ఈసారి ఫిల్మ్ ఫేర్ కొట్టేశాడు. ఇక ఎన్.టి.ఆర్ వరుస ప్రభంజనాలకు ఇలా ఎన్నేల్లు ఫిల్మ్ ఫేర్ అతన్ని వరిస్తాయో చూడాలి.

Leave a comment