Moviesఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ తో అన్నంత పని చేసిన ఆర్జివి..!

ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ తో అన్నంత పని చేసిన ఆర్జివి..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్ల్లు పోస్టర్స్ తో హంగామా సృష్టించిన ఆర్జివి వెన్నుపోటు సాంగ్ తో ఏకంగా చంద్రబాబుని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి మీద ఓ సాంగ్ వచ్చింది. సినిమాలో చంద్రబాబు, లక్ష్మి పార్వతి పాత్రలు చేస్తున్న వారిని రివీల్ చేసిన వర్మ ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. సినిమా కాస్టింగ్ విషయంలో వర్మ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మరోసారి ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది.

కుర్చిలో కూర్చుని డీప్ గా ఆలోచిస్తున్న ఎన్.టి.ఆర్ లుక్ రివీల్ చేశాడు వర్మ. సినిమాపై ఇప్పటివరకు ఉన్న నెగటివిటీ అంతా ఎన్.టి.ఆర్ లుక్ తో పోయిందని చెప్ప్పొచ్చు. అంతేకాదు నిన్న సాయంత్రం నుండి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లోని ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తప్పకుండా వర్మ ఈసారి గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాడని తెలుస్తుంది. అనుకున్న విధంగా ఈ నెల 24న సినిమా రిలీజ్ చేస్తాడని చెప్పారు.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించబడిన సినిమా. వర్మ ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీస్తున్నాడు. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ ఇంప్రెస్ చేయగా ఆ డైలాగ్ డిక్షన్ కూడా పలికిస్తే మళ్లీ ఎన్.టి.ఆర్ ను చూసినట్టే అనిపించడం ఖాయం. చెప్పినట్టుగానే వర్ధంతి రోజు మళ్లీ ఎన్.టి.ఆర్ ను బ్రతికిస్తా అంటూ వర్మ చెప్పింది చేసి చూపించాడని వర్మ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news