మహేష్ ట్వీట్ మీద మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్..?

tarak-fans-mahesh-tweet

Recently Prince Mahesh Babu tweeted one tweet which angers young tiger NTR fans. Read below story to know why.

ప్రిన్స్ మహేష్‌బాబు సాధారణంగా ఏ హీరోల గురించి మాట్లాడడు.. ఎలాంటి వివాదాల్లో తలదూర్చడు. తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. తనకు చాలా సన్నిహితుంగా ఉండే హీరోలకు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడమో, నేరుగా వారి ఇంటికి వెళ్ళడమో చేస్తాడే తప్ప.. అంతకుమించి మరో అడుగు ముందుకేయడు. ప్రెస్‌మీట్‌లలో సైతం ఏ హీరో గురించైనా చెప్పమని అడిగితే.. తన స్టార్ ఇమేజ్‌ని కూడా పట్టించుకోకుండా వారిపై ప్రశంసలు కురిపిస్తాడు.

అందుకే.. మహేష్‌ని ‘టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్’గా అభివర్ణిస్తాడు. అలాంటి మహేష్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అతను చేసిన ఒక ట్వీట్.. తారక్ ఫ్యాన్స్‌కి మండేలా చేసింది. దీంతో.. వాళ్లంతా మహేష్‌పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ ట్వీట్‌లో ప్రిన్స్ అలాంటి ఆ ఒక్క పదం వాడకుండా ఉండాల్సిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన ఆ ట్వీట్ ఏంటి? ఎందుకు తారక్ ఫ్యాన్స్ దానిపై అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఆ వివరాలన్నీ తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ ఈనెల 12వ తేదీన ఓ ట్వీట్ చేశాడు. ‘ఓ లివింగ్ లెజెండ్, ఒకేఒక్క తలైవా అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్ సార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్టీటాడు మహేష్. ఇదే తారక్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంటే.. ఇందులో మహేష్ ‘ఒకే ఒక్క తలైవా’ అనే పదం వాడాడు కాబట్టి. ‘ఒకే ఒక్క’ పదాన్ని మహేష్ వాడకుండా ఉండాల్సిందంటూ తారక్ అభిమానులందరూ సోషల్ మీడియాలో అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

ఎందుకంటే.. తారక్‌ని తామంతా ‘తలైవా’ అని పిలుచుకుంటామని, అలాంటప్పుడు మహేష్ కేవలం రజనీకాంత్‌ ఒక్కరే తలైవా అని ఎలా చెప్పగలుగుతాడంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నోత్తరాల పర్వం సామాజిక మాధ్యమాల్లో ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. మరి.. దీనిపై మహేష్, అతని ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Leave a comment