Gossipsఢీ 10 రావణుడి ఎంట్రీ వీడియో..!

ఢీ 10 రావణుడి ఎంట్రీ వీడియో..!

ప్రముఖ డ్యాన్స్ షో ఢీ 10 గ్రాండ్ ఫినాలే కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారనే వార్త గత కొంత కాలంగా ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్త కి బలం చేకూరుస్తూ ఈ రోజు సోషల్ మీడియా లో ఒక వీడియో ని విడుదల చేసారు షో నిర్వహులు. ఇందులో ఎన్టీఆర్ బారి గా ఎంట్రీ ఇచ్చే సన్నివేశాన్ని కట్ చేసి విడుదల చేసారు, వీడియో ని బట్టి ఎన్టీఆర్ కి షో నిర్వహులు ఘనంగా స్వాగతం పలికారని తెలుస్తుంది. దీనితో ఢీ 10 ఫైనల్స్ కి ఎన్టీఆర్ వస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రదీప్ మాచిరాజు ఈ రియాలిటీ డ్యాన్స్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఫైనల్స్ లో అక్సా ఖాన్ మరియు రాజు కి మధ్య గట్టి పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. విజేత ఎవరో తెలియాలంటే ఫైనల్స్ వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news