Gossipsఢీ2 v/s ఢీ10.. ఇది రావణుడి దెబ్బ..!

ఢీ2 v/s ఢీ10.. ఇది రావణుడి దెబ్బ..!

ఈటివి ప్రెస్టిజియస్ డ్యాన్స్ షో ఢీ 10వ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఢీ-10 గ్రాండ్ ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యారు. అయితే ఇదవరకు ఢీ సీజన్ 2కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు. ప్రభుదేవతో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా ఆ డ్యాన్స్ షోకి రావడం జరిగింది.

ఆ సీజన్ లో 1,2,3 నేనే కంత్రి పాటకు స్టెప్పులేసి అలరించాడు ఎన్.టి.ఆర్. ఇక లేటెస్ట్ గా నిన్న జరిగిన ఢీ-10 ఫైనల్స్ ఎపిసోడ్ లో స్వింగ్ జరా సాంగ్ తో స్టేజ్ అదిరిపోయేలా చేశాడు ఎన్.టి.ఆర్. అప్పటికి, ఇప్పటికి ఎన్.టి.ఆర్ డ్యాన్స్ లో ఏమాత్రం తేడా లేదని చెప్పొచ్చు. ఏది ఏమైనా డ్యాన్స్ అంటే ఎన్.టి.ఆరే అన్న మాటని మరోసారి ప్రూవ్ చేసేలా బుల్లితెర డ్యాన్స్ షోలో దుమ్మురేపేలా చేశాడు తారక్.

for more videos CLICK below Link

https://youtu.be/YvQw5Gp-diw

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news