Gossipsపాపం ఎన్టీఆర్ ! భార్య వల్ల అన్నికష్టాలు పడుతున్నాడా ..?

పాపం ఎన్టీఆర్ ! భార్య వల్ల అన్నికష్టాలు పడుతున్నాడా ..?

సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత సీరియస్ లుక్ లో కనిపిస్తాడో… రియల్ లైఫ్ లో దానికి భిన్నంగా చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎక్కడా షేర్ చేసుకొని జూనియర్ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ విషయాల గురించి ఫన్నీ ఫన్నీగా చెప్తుంటాడు.

వరుస హిట్ల తరువాత మరో భారీ హిట్ కొట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న అరవింద సమేత సినిమాకు సంబంధించి ట్రీజర్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో భారీగా చేపట్టారు. దీనిలో భాగంగా ఓ మీడియా ఛానెల్ కి సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ… తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

పిల్లలకి వండి పెట్టడం అంతా ప్రణతియే చూసుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు … ‘‘బాబోయ్‌ ఏం మాట్లాడుతున్నారు మీరు! మా ఆవిడ గురించి చాలా ఊహించుకున్నారు. అసలు ఆమెకు వంటే రాదు. ఒకవేళ తను వండినా తిని పారిపోవాలి(నవ్వుతూ). మా ఇంట్లో నేను మంచి వంటగాడిని. అన్ని వంటకాలు బాగా చేస్తా. అమ్మ ఇంకా బాగా వండుతుంది. మేం వండిపెడితే అమ్మా కొడుకులు(ప్రణతి, పిల్లలు) తిని కూర్చుంటారంతే మా ఇంట్లో నేనే ఆర్గనైజ్‌డ్‌గా ఉంటా. నాకు రూమ్‌ చాలా శుభ్రంగా ఉండాలి. మా ఆవిడకు చిందరవందరగా ఉంటే ఇష్టం అంటూ సమాధానం ఇచ్చాడు.

సాధారణంగానే ఎన్టీఆర్ కి వంట చేయడం అంటే చాలా ఇష్టం తల్లికు సాయం చేయటం, ఫ్రెండ్స్ కలిస్తే అందరు కలిసి వంటా,వార్పు చేయటం అలవాటు. అందుకే కాబోలు ప్రణితి వండితే ఎన్టీఆర్ కి నచ్చడంలేదేమో .. అంటూ కొంతమంది ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news