పవన్ ప్లాప్ సినిమాపై ఎన్టీఆర్ ఫైర్..!

114

వరుస హిట్లతో ఫుల్ ఫార్మ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ చేసిన త్రివిక్రమ్ తో అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్నాడు. అజ్ఞాతవాసి అంతటి ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి అంతా వెనకడుగు వేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోకుండా త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచారు.
అసలు అజ్ఞాతవాసి సినిమాకి ముందు త్రివిక్రమ్ కి చాలా క్రేజ్ ఉండేది కానీ ఆ ప్లాప్ తో అనూహ్యంగా అది కాస్తా పడిపోయింది.

కానీ అతడితో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ మొగ్గు చూపడంతో ఫ్యాన్స్ తో సహా అంతా ఆందోళన చెందారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదు. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో అరవింద సమేత సినిమాపై భారీగా ఆశలు పెట్టుకోవడమే కాదు ఎన్టీఆర్ని సినీ కెరియర్ లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచిపోతుందని ధీమాగా ఉన్నాడు.

ఇదే విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానాలు ఇచ్చాడు. తన కెరీర్లోనూ ఎన్నో ఫ్లాపులు ఉన్నాయని అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోయానని విజయాలు అందుకున్నానని.. ఒకరి గత సినిమా ఆడనంత మాత్రాన తర్వాతి సినిమా మీద ఆ ప్రభావం ఉంటుందని తాను అనుకోనని తారక్ అన్నాడు. ‘అజ్ఞాతవాసి’ ఫలితం తాలూకు ప్రభావం ‘అరవింద సమేత’పై ఉంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అతను స్పష్టం చేశాడు. ఈ సినిమా కథను చాలా చక్కగా త్రివిక్రమ్ రాసారని ఆ కథ నాకు ఎంతో నచ్చిందని, ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ సాదిస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేసాడు.

Leave a comment