Gossipsబ్రేకింగ్ న్యూస్ : బిగ్ బాస్-2 కి ఎన్టీఆర్ రీఎంట్రీ

బ్రేకింగ్ న్యూస్ : బిగ్ బాస్-2 కి ఎన్టీఆర్ రీఎంట్రీ

బుల్లితెర మీద భారీ అంచనాలతో వస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేయబోతున్నారని తెలిసిందే. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టగా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా అదే రేంజ్ లో ఉండేలా చూస్తున్నారు. జూన్ 10న మొదలవనున్న ఈ షోలో ఎన్.టి.ఆర్ స్పెషల్ ఎంట్రీ ఉంటుందట.

మొదటి రోజు స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2ని స్టార్ట్ చేసే బాధ్యతను నానితో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా తీసుకున్నాడట. దానిలో భాగంగానే ఆదివారం షోకి ఎన్.టి.ఆర్ కూడా వస్తున్నాడని టాక్. అంతేకాదు నానికి అలవాటయ్యే దాకా ఎన్.టి.ఆర్ కూడా కనిపిస్తాడని.. ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఎన్.టి.ఆర్ కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియదు కాని ఎన్.టి.ఆర్ మళ్లీ బిగ్ బాస్ స్టేజ్ పై ఉంటే ఆ కిక్ వేరేలా ఉంటుందని అంటున్నారు బుల్లితెర ఆడియెన్స్. అసలు ఏమాత్రం తెలుగు ఆడియెన్స్ కు పరిచయం లేని రియాలిటీ షో బిగ్ బాస్ దాన్ని అందరికి చేరువయ్యేలా చేశాడు తారక్. ఈసారి నాని హోస్ట్ గా ఈ షో సరికొత్త గేం ప్లానింగ్ తో వస్తుందని అంటున్నారు. మరి ఈ సీజన్ ఆడియెన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news