అరవింద సమేత లో బయటపడ్డ ఎన్టీఆర్ క్యారెక్టర్..?

112

ఎన్టీఆర్ తో మొదటిసారి సినిమా చేస్తున్న త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తోనే ముందుకు సాగుతున్నాడు. మరి ఈ కాంబినేషన్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఒక పక్క చూస్తే … అరవింద సమేత వీరరాఘవ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. ఈ సినిమా మీద అంచనాలు బాగానే వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తన వాగ్ధాటిని చుపిస్తాడాని, లెక్చరర్ అవతారం ఎత్తుతారని తెలుస్తోంది. అంటే ఉపన్యాసాలతో లెక్చర్లు దంచడం అన్నమాట. సెకండ్ ఆఫ్ లో
ఫ్యాక్షనిస్టులను మార్చాలనే ఆలోచనతో వారికి హితబోధలు చేస్తూ… భారీ ఉపన్యాసాలు ఇస్తూ వారిని మార్చే ప్రయత్నం చేస్తుంటాడట. ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో చెప్పే ఆ ఉపన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయని త్రివిక్రమ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
‘అరవిందసమేత వీరరాఘవ’ రామలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఫ్యాకన్ నేపధ్యం ఉన్న ఈ స్టోరీ లైన్ రెండు కుటుంబాల మధ్య సాగుతుందట.

Leave a comment