Gossipsఎన్నికల ప్రచారంలో ఎన్.టి.ఆర్..! ఏ పార్టీయో తెలిస్తే షాకే..?

ఎన్నికల ప్రచారంలో ఎన్.టి.ఆర్..! ఏ పార్టీయో తెలిస్తే షాకే..?

2019 ఎన్నికల హంగామా మొదలైందని చెప్పొచ్చు. తెలంగాణాలో ఆల్రెడీ డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగాతాయని తెలుస్తుండగా.. ఏపిలో మాత్రం మరో 9 నెలలు టైం ఉంది. అయితే ఈసారి కూడా టిడిపి తరపున ఎన్.టి.ఆర్ కాంపెయిన్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్.టి.ఆర్ టిడిపి సపోర్ట్ గా ప్రచారంలో ఉంటాడో లేదో తెలియదు కాని తను చేస్తున్న అరవింద సమేత సినిమాలో మాత్రం పొలిటికల్ కాంపెయిన్ లో ఉంటాడట.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న అరవింద సమేత సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో తండ్రి తరపున ఎన్.టి.ఆర్ ప్రచారంలో పాల్గొంటాడట. అయితే ఈ ప్రచారం చేయడంలో ఎన్.టి.ఆర్ కు మునుపటి అనుభవం ఉంది. 2009లో టిడిపి తరపున ప్రచారం చేశాడు తారక్. 2019 కి కూడా పార్టీకి ఎన్.టి.ఆర్ సపోర్ట్ ఉండేలా చూస్తున్నారు.

అరవింద సమేత సినిమా రిలీజ్ అయ్యాక తండ్రి తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా ఎన్.టి.ఆర్ అందిపుచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news