Gossipsఇప్పుడు ఎన్టీఆర్ నోరు విప్పుతారా.?

ఇప్పుడు ఎన్టీఆర్ నోరు విప్పుతారా.?

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. ఎన్నో సూపర్ హిట్ సినీమాల్లో నటించిన బాలయ్య ఆ మద్య ఫ్యాక్షన్ తరహా సినిమాలకు ప్రాధాన్య ఇస్తూ వచ్చారు. తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత ట్రెండ్ మార్చారు. ఈ మద్య తన తండ్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’రెండు భాగాలుగా తీశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ రెండు బయోపిక్ లు పెద్దగా విజయం మాత్రం సాధించలేదు.

ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్,ఎన్టీఆర్. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ పై జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గాఉన్నారు. సినిమా చూసారో? లేదో కూడా తెలియదు. మహానాయకుడు ట్రయిలర్ వచ్చిన ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో వేయలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు ప్రత్యేకంగా షోలు వేసారు. నందమూరి కుటుంబం అంతా దాదాపు వచ్చింది కానీ ఎన్టీఆర్ మాత్రంరాలేదు. ఈ సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత బాలకృష్ణ బాబాయ్ తో ఎన్టీఆర్ వేదిక పంచుకోబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు సమాచారం..మరి వేదిక మీద ఎన్టీఆర్ తాతగారిని స్మరించుకుంటారా..లేదా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news