చిరు రికార్డుని బద్దలుకొట్టిన ఎన్టీఆర్..!

196

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 మూవీ సంచలన విజయం అందుకుంది. పదేళ్ల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా 164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మెగా స్టామినా ప్రూవ్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5 లిస్ట్ లో చిరు ఖైది నంబర్ 150 చేరింది. ఇక ఇప్పుడు ఆ రికార్డును సైతం బ్రేక్ చేసింది ఎన్.టి.ఆర్ అరవింద సమేత.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేసిన అరవింద సమేత దసరా బరిలో దిగింది. అక్టోబర్ 11న రిలీజైన ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ దాటి ఇప్పుడు ఖైది రికార్డుని సైతం బ్రేక్ చేసింది. 164 కోట్ల గ్రాస్ తో ఖైది నంబర్ 1 ఉండగా 165 కోట్ల గ్రాస్ తో అరవింద సమేత సంచలనం సృష్టించింది.

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ 5 లో అరవింద సమేత నిలిచింది. వసూళ్ల పరంగా ఎన్.టి.ఆర్ మరోసారి తన సత్తా చాటాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది.

Leave a comment