అంతర్జాతీయ సంస్థ కి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఎన్టీఆర్..!

10

ఏ ప్రొడక్ట్ అయినా సరే దానికి తగిన ప్రమోషన్ లభిస్తే దానికి వచ్చే రెస్పాన్స్ వేరేలా ఉంటుంది. ఇక ఒక ప్రొడక్ కు స్టార్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. స్టార్ హీరోలు కేవలం సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మహేష్ సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తుంటే మహేష్ తర్వాత ఎన్టీఆర్ కూడా వాణిజ్య ప్రకటనలతో అభిమానులను అలరిస్తున్నాడు.

తారక్ క్రేజ్ ను వాడేసుకునేలా ప్రకటనలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ సెలెక్ట్ మొబైల్ స్టోర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నాడట. తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ చైన్ స్టోర్ గా సెలెక్ట్ రాబోతుంది. ఈమధ్య భరత్ అనే నేను హీరోయిన్ కియరా అద్వాని ఇప్పటికే రెండు సెలెక్ట్ స్టోర్స్ ఓపెన్ చేశారు.

ఇక ఈ సెలెక్ట్ స్టోర్స్ కు ఎన్.టి.ఆర్ బ్రాండింగ్ చేస్తున్నాడు. అవసరాలకు తగినట్టుగా మొబైల్స్ అంటూ ఈ సెలెక్ట్ మొబైల్ స్టోర్ రాబోతుంది. ఈమధ్యనే రాం చరణ్ కూడా హ్యాపీ మొబైల్ స్టోరెస్ కు సైన్ చేయగా ఎన్.టి.ఆర్ కూడా సెలెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Leave a comment