‘రణ్‌భూమి’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్

ntr-bollywood-entry

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటివరకు తెలుగు సినిమాలే చేస్తూ వచ్చాడు. నూనూగు మీసాల వయసులోనే ఆది, సింహాద్రి అంటూ రికార్డులతో చెడుగుడు ఆడిన సింగమలై తారక్.. కేవలం తెలుగు సినిమాలతోనే తన క్రేజ్ ను నేషనల్ వైడ్ గా ఏర్పరచుకున్నాడు. సౌత్ లో చెప్పుకోదగ్గ నటులలలో ఎన్.టి.ఆర్ ఒకడని చెప్పొచ్చు.

రోజులు మారుతున్నాయి టాలీవుడ్ మాత్రమే కాదు అటు కోలీవుడ్, బాలీవుడ్ మీద కూడా హీరొల దృష్టి పడుతుంది. ఇన్నాళ్లు టాలీవుడ్ కే అంకితమైన తారక్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. వరుణ్ ధావన్ తో కలిసి బాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నాడట తారక్.

ఈమధ్యనే వరుణ్ ధావన్ దర్శకుడు శశాంక్ కైతాన్ వచ్చి లైన్ చెప్పారట. స్టోరీ లైన్ నచ్చడంతో ఎన్.టి.ఆర్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పాడట. ఈ సినిమా టైటిల్ గా రణ్ భూమి అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అరవింద సమేత సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో నటిస్తాడు. ఆ సినిమా పూర్తయ్యాక కాని ఈ రణ్ భూమి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Leave a comment