ఆ సినిమా కోసం ఈ పని చేస్తున్నాడా ..? అయ్యో తారక్

ntr new

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో యంగ్ ఎన్టీఆర్ ఒకరు. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ ఎన్టీఆర్ తనదైన స్టయిల్ల్లో దూసుకుపోతుంటాడు. అందుకే సినిమాలో తన పాత్రకి తగ్గట్టుగా తన గెటప్ మార్చుకుని సిద్దమైయిపోతుంటాడు. టెంపర్ సినిమాలో ఒకలా కనిపించిన తారక్ ‘నాన్నకు ప్రేమతో’ కోసం గెడ్డం పెంచాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ స్టైల్‌ అందరికీ నచ్చేసింది. ‘జనతా గ్యారేజ్‌’లోనూ చాలా కొత్తగా కనిపించదు ఈ అందాల రాముడు.

క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోతున్న సినిమాలో నటించబోతోన్న యంగ్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన బాడీకి గట్టి పనే చెప్పాడు. సినిమాలో చేయబోయే పాత్రకి స్లిమ్ గా కనిపించాలని త్రివిక్రమ్ సూచించడంతో ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో పడ్డాడు. దీనికోసం ఆయన స్పెషల్ గా ఒక ఫిట్నెస్ ట్రయినర్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యనే ఫ్యామిలీతో విదేశీ టూర్ కి వెళ్లొచ్చిన ఈ యంగ్ హీరో బరువు తగ్గే పనిలో నిమగ్నమైయిపోయాడు.

ఈ సినిమాలో నువ్వు నాకు నచ్చావ్ సినిమాని పోలి ఉంటుందని అందుకే త్రివిక్రమ్ ఇలా పురమాయించాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ను బృందావనం తరహా లుక్‌ కావాలని త్రివిక్రమ్‌ కోరాడట. ఈమధ్య గడ్డంలో కనిపిస్తోన్న ఎన్టీఆర్‌ ఈసారి మాత్రం స్టబుల్‌తో యంగ్‌గా కనిపించబోతున్నాడట. ఈ మతాల మాంత్రికుడి సినిమాలో యంగ్ తారక రాముడు ఎలా కనిపించబోతున్నాడో అని ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు.

Leave a comment