బాబీ-ఎన్టీఆర్‌ల సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఒకరోజు ముందే!

tr bobby movie launch daute fix

Finally young tiger NTR’s 27th project is going to be launch in this month which is directing by Bobby. Nandamuri Kalyan Ram will producer this movie under NTR Arts banner with high budget. They are planning to start shooting from the next month.

దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ దర్శకుడిగా బాబీని ఎంచుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్దామని ప్లాన్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో.. నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ స్టోరీ తనదేనని ప్రముఖ రచయిత కోనవెంకట్ ఎంట్రీ ఇవ్వడం, ఆల్రెడీ కథని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి అమ్మేశానని చెప్పడం, బాబీ అతని వద్దకు వెళ్ళి బుజ్జగించడం, తాను ఈయనని ఆ హీరో రిజెక్ట్ చేయడం అంతా జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో.. ఎన్టీఆర్-బాబీ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. దానికి బాబీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.

తన దగ్గరున్న స్టోరీల్లో ఒకదాన్ని బయటకు తీసి ఎన్టీఆర్‌కి వినిపించాడు. అది నచ్చడంతో.. వెంటనే పూర్తి స్ర్కిప్ట్‌ని రెడీ చేయడంలో బాబీ బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తయిపోయింది. అంతేకాదు.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఇండస్ట్రీవర్గాల వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఈనెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. ఇంతకుముందు కోన కథతో సెట్స్ మీదకి వెళ్ళాలనుకున్న ప్రాజెక్ట్‌ని ఈనెల 10న ప్రారంభించాలని అనుకున్నారు కానీ.. అది బెడిసికొట్టడంతో దానికి ఛాలెంజింగ్‌గా ఒకరోజు ముందే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆరోజు కొబ్బరికాయ కొట్టేసి.. వచ్చే నెలలో సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయట. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్ వివరాల్ని ప్రారంభోత్సవం రోజే వెల్లడించనున్నారని.. ఒకవేళ ఆరోజు కుదరని పక్షంలో షూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ భారీ బడ్జెట్‌తో ‘ఎన్టీఆర్ ఆర్డ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించి.. వచ్చే ఏడాది సమ్మర్‌లోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి.. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు ఆ సమయం రానే వచ్చేసిందన్నమాట.

Leave a comment