ఎన్టీఆర్ బర్త్ డే కానుక ఇదే.. ఓ రోజు ముందే సంబరాలు..!

ntr-birthday-gift

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశ తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి టైటిల్స్ రకరకాలుగా వినపడుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఎన్.టి.ఆర్ బర్త్ డే నాడు మే 20న టైటిల్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

అయితే కొద్ది నిమిషాల క్రితం ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ వారు ట్వీట్ చేయడం జరిగింది. తారక్ బర్త్ డేకు ఓ రోజు ముందే త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రాజమౌళి ట్రిపుల్ ఆర్ లానే త్రివిక్రం, తారక్, తమన్ అంటూ ట్రిపుల్ టి కాన్సెప్ట్ ను తమన్ ట్రెండ్ చేస్తుండటం విశేషం. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు మన మాటల మాంత్రికుడు.

Leave a comment