ఎన్.టి.ఆర్ బయోపిక్ టైటిల్ మొత్తం మార్పు..! ఫ్యాన్స్ కి షాక్..

92

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా టైటిల్ మారుతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. బాలకృష్ణ ఎంతో ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు ఏకంగా 60 గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.

ఇక ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ లో టైటిల్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు అని పెట్టారు. కథానాయకుడు అని స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేశారు. ఇది చూస్తే ఎన్.టి.ఆర్ కాస్త ఎన్.టి.ఆర్ కథానాయకుడు అని పెట్టబోతున్నారా అన్న సందేహం వస్తుంది. అయితే ఎన్.టి.ఆర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు స్టిల్ లో బాలకృష్ణ అద్భుతంగా ఉన్నాడు.

ఈ సినిమా బాహుబలి రికార్డులను కూడా తిరగ రాసే అవకాశం ఉందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో చూడాలంటే 2019 జనవరి 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

1

Leave a comment