బాలీవుడ్ నే భయపెడుతున్న బాలయ్య..

balayya

ఇప్పటికే బాలీవుడ్ హీరోలకు బాహుబలి సినిమా ఇచ్చిన షాక్ కు తలమునకలవుతుంటే ఇప్పుడు బాలయ్య సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇంతకీ బాలయ్య ఏ సినిమా చూసిన్ బాలీవుడ్ హీరోలు భయపడుతున్నారంటే బాలయ్య తన తండ్రి స్వర్గీయ ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా చేస్తున్న సినిమా గురించే అని తెలుస్తుంది.

తెలుగులో ఉన్న యువ, స్టార్, సీనియర్ కేటగిరి హీరోలందరిలో బాలయ్యలా డైలాగ్ చెప్పే హీరో మరొకరు లేరని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా బాలయ్య తర్వాతనే అని చెప్పొచ్చు. అయితే బాలయ్య బయట తెలుగు తడబడతారేమో కాని డబ్బింగ్ లో మాత్రం దంచికొడతారు. ఇక ఎవరికి తెలియని మరో విషయం ఏంటంటే బాలయ్యకు హింది కూడా బాగా వచ్చట.

హిందిని అనర్గళంగా మాట్లాడతారట బాలయ్య. తెలుగు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడతారో హిందిని కూడా అదే విధంగా మాట్లాడుతారని తెలుస్తుంది. అందుకే తీస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ను హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదో రకంగా బీ టౌన్ హీరోలకు షాక్ ఇచ్చే అంశమే. ఎన్.టి.ఆర్ అంటే దేశం మొత్తం తెలిసిన మహనీయుడు మరి ఆయన బయోపిక్ హింది ఆడియెన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. మరి హిందిలో బాలయ్య డైరెక్ట్ గా చేయబోయే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment