జగన్ చేతుల్లోకి ఎన్టీఆర్ బయోపిక్

ntr biopic

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ ఒక సంచలనం గా మారిందనే చెప్పుకోవాలి.నేను అంటే నేను అని  పోటీపడుతూ మరి డైరెక్టర్లు ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు.సోషల్ మీడియా లో వాళ్ళు వీళ్లు అని తేడా లేకుండా ప్రతి  ఒక్కరి

మీద సెటైర్లు వేస్తూ వాటిని  కాంట్రావర్సీ చేస్తూ తెరమీదకు వచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తెరకేక్కిన్చాలని చుస్తునారు.తాజాగా తేజ డైరెక్టర్ గా బాలయ్య బాబు తో ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెడ్తున్నట్టు సినీవర్గాలలో బహిరంగంగా వెల్లడించారు.

వర్మ తీస్తున్న బయోపిక్ లో మొత్తం ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లి చేసుకోవడం ఆయన చివరి రోజుల్లో ఎలా  గడిపేవారు అనే ఉద్దెశం తోనే ఈ చిత్రం తెరకెక్కనుందట.ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వైసీపీ నేత జగన్ ఆప్తుడైన రాకేష్‌రెడ్డి చేయనున్నాడట. ఈ సినిమా కాంట్ర‌వ‌ర్సీల కోణం లో ఉంటుందా లేదా జనాల్ని

మేపించేటట్లు ఉంటుందా అని వేచి చూడాల్సిందే?.

తేజ విషయానికి వస్తే మొత్తం ఎన్టీఆర్ కెరీర్ నిమ్మ‌కూరులో స్టార్ట్ అయినప్పటినుండి అయన విద్యాబ్యాసం,పెళ్లి మరియు అయన రాజకీయ ప్రవేశం వంటి ఎన్నో అంశాలను తేజ తెరకేక్కిన్చాలని చేస్తున్నారట. దీని కి ప్రొడ్యూసర్ గా బాల‌య్య మరియు ఆయన సన్నిహితులైన  సాయి కొర్ర‌పాటి, సీసీఎల్ విష్ణు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారట. ఈ రెండిట్లో ప్రజలు ఏ సినిమాని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే

Leave a comment