ఎన్.టి.ఆర్ బయోపిక్.. చేతులెత్తేసిన క్రిష్..!

94

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తేజను పక్కకు తప్పించిన తర్వాత క్రిష్ జాగర్లముడి డైరెక్షన్లో షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహానటుడు, రాజకీయ నాయకుడు జీవిత కథని రెండున్నర గంటల్లో ప్రేక్షకులకి సినిమా రూపంలో చూపించలేనని భావించి క్రిష్ ఒకానొక పరిస్థితిలో చేతులు ఎత్తేశాడట.

ఈ నేపథ్యంలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన ఇతరులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ను రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్తోపాటు చిత్ర యూనిట్ భావిస్తున్నదట. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ప్రణాళికలో కొద్దిగా మార్పు చేసినట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ సినీ, వ్యక్తిగత జీవితాన్ని మొదటి భాగంలో.. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు రెండో భాగంలో చూపించే ప్రయత్నం జరుగుతున్నదట. గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాల మంచి సక్సెస్ అయితే రెండు పార్టులుగా తీస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఇదే బాటలో క్రిష్ కూడా నడవబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి పార్ట్-1ను రిలీజ్ చేసి.. మరో రెండు నెలల్లోపు పార్ట్-2 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే స్ట్రాటెజీ నిజమైతే నందమూరి, సినీ అభిమానులకు పండుగే అంటున్నారు. తాజాగా తొలి భాగం సినిమాను ‘యన్టిఆర్ కథానాయకుడు’ టైటిల్తో విడుదల చేస్తున్నారు.

‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు’ అని వెల్లడిస్తూ సినిమా పోస్టర్ను విడుదల చేశారు. ఎన్టీయార్ సినీజీవితం నేపథ్యంలో మొదటి భాగం, రాజకీయ జీవితం ఆధారంగా రెండో భాగం తెరకెక్కనున్నట్టు వార్త వచ్చింది. ఆ విషయాన్ని డైరెక్టర్ క్రిష్ తాజాగా ధ్రువీకరించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక, రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా కూడా రెండు, మూడు వారాల వ్యవధిలోనే విడుదల కాబోతుందని సమాచారం.
1

Leave a comment