ఎన్టీఆర్ కథ ఆ ఎపిసోడ్ నుంచే స్టార్ట్..!

sr.ntr

అందరూ  ఎప్పుడా ఎప్పుడా  అని ఎదురు చూస్తున్న నంద‌మూరి తార‌క‌రామారావు జీవితం త్వరలోనే వెండితెర‌కెక్కుతోంది. ఈ వార్త తెలియగానే  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అన్న‌గారి అభిమానుల్లో ఒక‌టే ఆసక్తి మొదలయిపోయింది.ఈ సినిమా క‌థ ఎక్క‌డ మొద‌ల‌వుతుంది? ఎక్క‌డ ఎక్కడ ముగుస్తుంది ? ఆయ‌న జీవితంలో విల‌న్ల క‌థ‌ని, వివాదాల్ని య‌థాత‌థంగా తెరపై చూపిస్తారా? ఇలాంటి సందేహాలెన్నో వ‌చ్చాయి.వాట‌న్నింటికీ స‌మాధానం సంసిద్ధం చేస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.
నాన్న‌గారి జీవిత‌క‌థ‌లో న‌టిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు, అనుకున్న‌దే త‌డ‌వుగా ఈ సినిమా క‌థ‌ని అంతే వేగంగా త‌యారు చేయించారు. ఇందులో ఇంకా చాలా అంశాలనే చూపించబోతున్నారు. కొన్ని సీన్లు పరిశీలిస్తే … ‘‘అవి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న రోజులు. ఓసారి కారులో పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావుతో కలిసి తిరుపతికి వెళ్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్క రాముడు – కృష్ణుడి నిలువెత్తు కటౌట్లు కనిపించాయి. వాటికి ఆమె భక్తితో నమస్కరిస్తుంది.
దాంతో పీవీ అవి నిజమైన దేవుళ్ల కటౌట్లు కాదని చెబుతారు. మరెవరివి అన్న ప్రశ్న వెనువెంటనే ఆమె నోటినుంచి వస్తుంది. దానికి పీవీ బదులిస్తూ… జనం గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన ఆ కటౌట్లు ఎవరివంటే…’’ ఎన్టీఆర్ జీవిత గాథతో బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమా ఈ సీన్ తో మొదలుపెట్టాలన్నది ఆ సినిమా డైరెక్టర్ తేజ ఆలోచన. దీనికి కారణం కూడా లేకపోలేదండోయ్ ! ఎన్టీఆర్  ఎంత గొప్పవాడో ఓ ప్రధాని ఆసక్తిగా తెలుసుకోవడం అన్న ఎత్తుగడ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందన్నది తేజ ఆలోచన అని తేజ స్నేహితుడొకరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగువారందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నందమూరి తారకరామారావు. కోట్లాదిమంది ఆరాధించిన నటుడిగా.. రాజకీయాల్లో అడుగు పెట్టిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి ఎన్టీఆర్ జీవిత గాథతో తెరకెక్కించేందుకు ఆయన తనయుడు – నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యంగ్ ఏజ్ నుంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఎలాఎదిగాడన్నదే ముఖ్యంగా చూపించనున్నారు. వి.పి.సింగ్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగించేయబోతున్నారు.

Leave a comment