రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ అమెజాన్ రైట్స్

14

బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుండి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా బిజినెస్ విషయంలో జోష్ మాములుగా లేదు. ఓవర్సీస్ లో 20 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక మరో పక్క ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయట.
1
ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ అమేజాన్ ప్రైం ఎన్.టి.ఆర్ బయోపిక్ పై 15 కోట్ల భారీ డీల్ సెట్ చేసుకున్నారట. సినిమాకు జరుగుతున్న బిజినెస్ మరింత భారీ హోస్ప్ క్రియేట్ చేస్తుంది. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ అంశాలను ప్రస్థావిస్తూ ఎన్.టి.ఆర్ బయోపిక్ రాబోతుంది.

విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మాణ భాగస్వామ్యం అవుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సినిమా మొత్తం బాలకృష్ణ తన ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నాడట. బిజినెస్ చూస్తుంటే సినిమా భారీ రేంజ్ కు వెళ్లేలా అనిపిస్తుంది.

Leave a comment