Gossipsఎన్టీఆర్ బయోపిక్.. ఫ్యాన్సీ ఆఫర్ కాదన్న బాలయ్య..!

ఎన్టీఆర్ బయోపిక్.. ఫ్యాన్సీ ఆఫర్ కాదన్న బాలయ్య..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా చేస్తున్న బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మూవీ వరల్డ్ వైడ్ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోనీ తెలుగు, తమిళ, హింది మూడు భాషల్లో కలిపి 80 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ కోట్ చేసింది. బాలకృష్ణ మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ముఖ్యంగా ఎన్.టి.ఆర్ కు సంబందించిన ఎన్నో విషయాల గురించి ఇందులో ప్రస్థావించడం జరుగుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ పై అంచనాలు పెంచేలా ఈ ఆఫర్ రావడం జరిగింది. సినిమాలో బాలకృష్ణ 64 గెటప్పులలో కనిపిస్తాడట. 2018 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలల్లా వ్యాపించేసిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కచ్చితంగా బయోపిక్ సినిమాల్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాపై బాలయ్య నమ్మకం చూస్తుంటే ఎన్.టి.ఆర్ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news