Gossipsసంచలనంగా మారిన ఎన్టీఆర్ ఓవర్సీస్ రైట్స్..

సంచలనంగా మారిన ఎన్టీఆర్ ఓవర్సీస్ రైట్స్..

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ డైరెక్షన్ లో వెండి తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలావరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల చేయబోతున్నారు.

ఓవర్‌సీస్‌లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత ఎమౌంట్‌ను ఈ సినిమా వసూల్ చేయగలదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇది భారీ రికార్డు గానే చెప్పాలి. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండబోతుంది కనుక కలెక్షన్లకు డోకా ఉండదని బయలు బయ్యర్లు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తుంటే ఇక విడుదలయ్యాక ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా… ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news