తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుందా..?

ntr-bio-pic-detai;s

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్.టి.ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే కళ్యాణ్ రాం, తారకరత్నలతో పాటుగా మహేష్ బాబు నటిస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ భామ దీపికా పదుకునే కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.

అయితే సినిమాలో ఎన్.టి.ఆర్ నటించే ఛాన్స్ లేదని తెలుస్తుండగా మోక్షజ్ఞ కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించే అవకాశం లేదని తెలుస్తుంది. మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా త్వరలో మొదలవనుందని అన్నారు. కాని ఆ సినిమా విశేషాలు బయటకు రాలేదు. ఈలోగా ఎన్.టి.ఆర్ సినిమాలో నటిస్తాడని అన్నారు. కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

ఈ బయోపిక్ లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపిస్తాడట. దాదాపు 60 గెటప్పుల్లో బాలయ్య బాబు కనిపిస్తాడట. రీసెంట్ గా అట్టహాసంగా మొదలైన ఈ సినిమా దసరా నాటి కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Leave a comment