Gossipsఎన్టీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చిన బిగ్ బాస్ టీమ్

ఎన్టీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చిన బిగ్ బాస్ టీమ్

పొద్దు పొద్దున్నే 6 గంటలకి అలారమ్ పెట్టుకొని లేచి బెడ్ కాఫీ తాగుదామని కప్పు అందుకున్న ఎన్టీఆర్ తన బెడ్ చుట్టూ ఉన్న కెమెరాలని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన రూమ్ లో కెమెరాలు పెట్టింది బిగ్ బాస్ సిబ్బంది అని గ్రహించిన ఎన్టీఆర్ “ఓరి నాయనోయ్ కెమెరాలు ఎవడ్రా ఇక్కడ పెట్టింది? నేను పెట్టమని చెప్పింది బిగ్ బాస్ హౌస్ లో.. నా హౌస్ లో కాదు.. మార్చెయ్యండి త్వరగా..” అంటూ కెమెరాలు తన రూమ్ లో పెట్టి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ సిబ్బంది కి చెప్తాడు ఎన్టీఆర్. ఫన్నీ ఫన్నీ గా సాగిన ఈ 30 సెకండ్ల బిగ్ బాస్ రెండవ టీజర్ ని నిన్న రాత్రి 8 గంటలకి స్టార్ మా వాళ్ళు విడుదల చేశారు. పెద్ద తెర మీదే కాదు చిన్ని తెరపై కూడా ఇరగదీసేందుకు ఎన్టీఆర్ సిద్దమైనట్లు మనకి ఈ టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది.

వివాదాలకు నిలయమైన బిగ్ బాస్ కార్యక్రమాన్ని తెలుగు లో మాత్రం కామెడీ యాంగిల్ లో చూపించాలని ప్రయత్నిస్తున్నారంట. మన తెలుగు సెలబ్రిటీస్ కూడా హిందీ వాళ్ళలా కాకుండా తెర పై వివాదాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారంట. కాబట్టి తెలుగు బిగ్ బాస్ లో కామెడీ మరియు మన పార్టిసిపెంట్స్ జీవితాల్లో జరిగే హార్ట్ టచింగ్ సంఘటనలని చర్చకి వచ్చే విధంగా ప్లాన్ చేశారంట. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి ని 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి బుక్ చేసుకున్నారట. మన అచ్చ తెలుగు హీరోయిన్లు మధుశాలిని, తేజస్విని లని కూడా ఒప్పించారని వినికిడి. ఇక ఫాన్స్ కూడా ఈ బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news