బిగ్ పరేషాన్‌.. ఎన్టీఆర్ దెబ్బకు కోలుకోని బాస్..!

80

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRRలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా తారక్ ఇప్పటికే రికార్డ్ సృష్టించగా.. మెగా పవర్ స్టార్‌తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న తారక్ మరిన్ని రికార్డులకు తెరలేపేందుకు రెడీ అయ్యాడు. కాగా తారక్ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అదే స్థాయిలో రికార్డులు సృష్టించాడు.
3
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ వన్‌లో తారక్ హోస్టింగ్‌కు ఫిదా కాని ఆడియెన్స్ ఉండరు. ఆ సీజన్ అంతలా హిట్ అయ్యేందుకు కారణం తారక్ అనడంలో అతిశయోక్తి లేదు. తనదైన మార్క్ యాంకరింగ్‌తో తారక్ సృష్టించిన టీఆర్‌పీ రేటింగ్స్‌ అప్పట్లో ఒక రికార్డు అని చెప్పాలి. ఇక సీజన్ 2కు తారక్ హోస్ట్ చేయలేదు. కాగా మరోసారి బిగ్ బాస్ షోకు తారక్ హోస్టింగ్ చేస్తున్నాడంటూ గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రిపరేషన్ వర్క్ కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీ టాక్. అటు షో నిర్వాహకులు కూడా రెమ్యునరేషన్ విషయంలో తారక్‌ను ఓకే చేసినట్లు టాక్. అయితే RRR షూటింగ్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా తారక్ లాస్ట్ మినట్‌లో ఈ షో హోస్ట్ చేయనని చెప్పాడు.
2
దీంతో బిగ్ బాస్ నిర్వాహకులకు బిగ్ షాక్ తగిలి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తారక్‌ హోస్ట్ చేస్తాడనుకున్న షోను ఇప్పుడు ఎవరితో హోస్ట్ చేయించాలా అని వారు తలలు పట్టుకున్నారు. పాపం.. తారక్ దెబ్బకు బిగ్ బాస్ సీజన్ 3 ఎటు పోతుందో అని క్రిటిక్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తారక్ కాదంటే.. ఇతర స్టార్లను క్యూలో పెట్టుకుని ఉండాల్సిందని ఫిల్మ్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా ఎవరు వస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.
1

Leave a comment