బిగ్ బాస్ ఎన్టీఆర్… ఫస్ట్ లుక్ చితక్కొట్టేశాడు…!

ntr-bigboss-first-look

నూనుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ రికార్డులను షేక్ ఆడించిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు బిగ్ బాస్ షోకి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్నాడని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త. స్టార్ మా యాజమాన్యం కన్ఫాం చేసి చెప్పినా ఎక్కడో ఓ సందేహం ఉండేది. ఇక ఆ డౌట్లన్ని పటాపంచెలు చేస్తూ బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

బిగ్ బాస్ చెయిర్ లో కూల్ లుక్స్ తో కన్ను కొడుతున్న తారక్ చూస్తుంటే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. స్టార్ మాలో త్వరలో స్టార్ట్ అవుతున్న బిగ్ బాస్ షోకు తారక్ హోస్ట్ గా సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఇందుకు గాను దాదాపు 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. హిందిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ఇప్పుడు రీజినినల్ లాంగ్వేజెస్ కు విస్తరించడం జరిగింది.

ఇప్పటికే కోలీవుడ్ లో అనగా తమిళంలో బిగ్ బాస్ కు కమల్ హోస్ట్ గా ఉంటున్నాడు. ఆ ఎపిసోడ్ కర్టెన్ రైజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ గా తారక్ అవతారం అదరగొట్టేసింది. సినిమాలతో రికార్డులు బద్ధలు కొడుతున్న జూనియర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా సంచనలాను సృష్టించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ బుల్లితెర బిగ్ బాస్ ఎలా అలరిస్తాడో చూడాలి. బిగ్ బాస్ ఎన్టీఆర్.. ఫస్ట్ లుక్ అదిరింది..!

Leave a comment