Gossipsబిగ్ బాస్-3 కి హోస్ట్ గా రీ-ఎంట్రీ ఇస్తున్న ఎన్.టి.ఆర్..!

బిగ్ బాస్-3 కి హోస్ట్ గా రీ-ఎంట్రీ ఇస్తున్న ఎన్.టి.ఆర్..!

స్క్రీన్ ఏదైనా.. టాస్క్ ఏదైనా టైగర్ వచ్చాడంటే దుమ్ముదులిపేయాల్సిందే అన్నట్టుగా అటు సిల్వర్ స్క్రీన్ పై తన నట విశ్వరూపంతో సంచలనం సృష్టిస్తున్న ఎన్.టి.ఆర్ మొదటిసారి బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టాడు. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది అంటే అది కచ్చితంగా ఎన్.టి.ఆర్ హోస్టింగ్ వల్లే అని చెప్పొచ్చు.

అసలు తెలుగు ప్రేక్షకులకు అర్ధం కాని బిగ్ బాస్ రియాలిటీ షోని తన ఓన్ చేసుకునేలా చేశాడు ఎన్.టి.ఆర్. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. నాని కూడా పర్వాలేదు అనిపించినా ఎంతైనా ఎన్.టి.ఆర్ అంత చేయలేదు అన్నది వాస్తవం. అందుకే బిగ్ బాస్ 3కి మళ్లీ యంగ్ టైగర్ నే తెచ్చేస్తున్నారట.

మొదటి సీజన్ కు రెండో సీజన్ కు ఎక్కువ గ్యాప్ వచ్చింది కాని ఈసారి బిగ్ బాస్ 3వ సీజన్ అతి త్వరలోనే మొదలు పెడతారట. ఇప్పటికే ఎన్.టి.ఆర్ తో డిస్కషన్స్ పూర్తవగా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే బయటకు వస్తుందని తెలుస్తుంది. మరి రాబోయే సీజన్ కంటెస్టంట్స్ ఎవరవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news