Gossipsఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్-2.. కాన్సెప్ట్ అదిరిపోతుందట..!

ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్-2.. కాన్సెప్ట్ అదిరిపోతుందట..!

బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ దగ్గరకు రావడంతో ఈ షో నిర్వాహకులు ఈ ఫైనల్ ఎపిసోడ్ ను హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాబోతున్న ఈ ఫైనల్ ఎపిసోడ్ కొత్తగా ఉండబోతుందట. ఆదివారం నాగార్జున సర్ ప్రైజ్ ఎంట్రీతో బిగ్ బాస్ షో క్రేజ్ సంపాదించగా ఇక రానున్న ఆదివారం బిగ్ బాస్ లో మరోసారి ఎన్.టి.ఆర్ కనిపించి అలరించనున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా ఎన్.టి.ఆర్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ కు ఎన్.టి.ఆర్ ను తెచ్చి షో మీద మరింత ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఐదుగురిలో ఇద్దరు ఫైనల్స్ కు వెళ్తారు. వారిలో ఒకరిని టైటిల్ విన్నర్ గా ఎనౌన్స్ చేస్తారు.

ప్రస్తుతం టైటిల్ రేసులో కౌశల్, తనీష్, గీతా మాధురిలు ఉన్నారు. అయితే కౌశల్ ఆర్మీ హంగామా చూస్తుంటే కౌశలే టైటిల్ విన్నర్ అయ్యేలా పరిస్థితులు కనబడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news