ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌..!

23

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న R R R సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే భారీ మ‌ల్టీ స్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా రూ. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై రాజమౌళి కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ సైనికులు దాడి చేసినప్పుడు ఆ దాడిని కొమ‌రం భీం ఎలా తిప్పికొట్టాడో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలెట్ కానున్నాయ‌ట‌.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఈ తరం జనరేషన్ హీరోలు గెస్ట్ రోల్స్ చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు గతంలోనే దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో గెస్ట్ రోల్ చేయాలని రిక్వెస్ట్ వచ్చింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో గెస్ట్ రోల్‌ చేసేందుకు ఓకే చెప్పినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్‌ గెస్ట్‌ రోల్‌లో నటించేందుకు ఓకె చెప్పారట.

ఎన్టీఆర్‌ సన్నిహితుడు పీఆర్వో మహేష్ కోనేరు నిర్మిస్తున్న సినిమా కావటంతో ఎన్టీఆర్ ఈ రోల్‌కు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు మహేష్ ఎస్ కోనేరు పిఆర్వోగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌తో పాటు క‌ళ్యాణ్‌రాంకు సైతం క‌థ‌ల ఎంపిక‌లో మ‌హేష్ కోనేరు సాయం చేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఇక క‌ళ్యాణ్ హీరోగా ఇటీవ‌ల వ‌చ్చిన 118 సినిమాకు కూడా మ‌హేష్ నిర్మాత‌గా ఉన్నారు. ఈ అనుబంధం నేప‌థ్యంలోనే మ‌హేష్ తాజాగా చేస్తున్న ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పార‌ట‌. ఈ వార్త‌లపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a comment