Gossipsఎన్టీఆర్ కోసం ఐటమ్ గర్ల్ గా మారిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ఎన్టీఆర్ కోసం ఐటమ్ గర్ల్ గా మారిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అందమైన భామలు పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట.
3
ఆ సాంగ్ లో హాలీవుడ్ ప్రమోటెడ్ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నర్తిస్తుందని తెలుస్తుంది. పిసితో ఎన్.టి.ఆర్ స్టెప్పులంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె బాలీవుడ్ సినిమాలనే చేసే టైం లేదని చెబుతుంటే ఎన్.టి.ఆర్ తో ఐటం సాంగ్ చేసేంత వీలు ఉంటుందా అంటున్నారు.
1
నిజంగా ఇది జరిగే పనేనా అని అంటుండగా ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా ఇటలీలో షూట్ జరుపుకుంటుంటే అక్కడే ఉన్న ప్రియాంకాతో అరవింద సమేత హీరోయిన్ పూజా హెగ్దె ఫోటో దిగడం ఈ వార్తలకు కారణమైంది. అసలు వెళ్లింది ఎన్.టి.ఆర్, పూజాల సాంగ్ షూటింగ్ కోసం. మరి ఎన్.టి.ఆర్ తో ప్రియాంకా చోప్రా స్టెప్పులేయడం అది రూమరే అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news