ఎన్టీఆర్ త్రివిక్రమ్ టైటిల్ & స్టోరీ లైన్ లీక్

ntr and tri vikram

మూడు వరస హిట్లు తర్వాత జై లవ కుశ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జై లవ కుశ తో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే పని లో వున్నాడట ఈ నట రుద్రుడు . ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యనున్నాడన్న సంగతి తెలిసిందే . కానీ త్రివిక్రమ్ PK 25 తో బిజీ గ ఉండడంతో ఎన్టీఆర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని వినికిడి .

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం సూపర్ కథ ను రెడీ చేసారని అలాగే టైటిల్ కూడా ఫిక్స్ చేసారని టాలీవుడ్ వర్గాల సమాచారం . ఈ సినిమాలో ఎన్టీఆర్ మిలిటరీ పాత్రలో కనిపించనున్నాడని గత కొద్దీ రోజులు గ వినిపిస్తున్న వార్త . కాగా కథ ఇలా ఉండబోతుందని ఇండస్ట్రీ లో గుస గుస లు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ ముందుగా దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడట, దాని
తర్వాతా స్వగ్రామానికి తిరిగి వచ్చి ఎన్టీఆర్ ఎం చేసాడు . తన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది , దీనికి తన వృత్తికి లింక్ ఏంటి అన్నదే అసలు కథగా తెలుస్తుంది .

ఈ సినిమాకి సోల్జర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట త్రివిక్రమ్ . తాజాగ ఈ టైటిల్ పై ఇండస్ట్రీ లో తెగ ప్రచారం జరుగుతుంది . అయితే సోల్జర్ అనేది ఇంగ్లీష్ టైటిల్ అనుకున్న త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ ఈ చిత్రం ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Leave a comment