ఆ ప్లాప్ డైరెక్టర్ తో సింహాద్రి లాంటి సినిమా..

ntr

వెండితెర మీద నవరసాలు పండించడంలో తారక్ ని మించినవారు ఉండరు. ఆయనతో పని చెయ్యాలంటే దర్శకులు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. అవును మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంతే… క్లాస్ మాస్ అనే బేధమే లేదు అన్ని వర్గాల ప్రజలు జూనియర్ సినిమాలంటే ఇష్టపడతారు. గతంలో ఏ యంగ్ హీరో రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా ఈ మధ్యకాలంలో ట్రెండ్ మార్చాడు. రొటీన్ కి భిన్నంగా ఉండే కధలను ఎంచుకుని ఇండ్రస్ట్రీలో హవా కొనసాగిస్తున్నాడు. విభిన్నమైన కథలతో సరికొత్త సినిమాలు చేస్తూ తన క్రేజ్ అమాంతం పెంచేసుకుంటున్నాడు ఈ యంగ్ ఎన్టీఆర్.

తారక్ శ్రీకాంత్ అడ్డాల కాబినేషన్ లో రాబోతున్న సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా ప్లాపులతో సతమతం అవుతున్న ఈ దర్శకుడు మళ్లీ సరైన హిట్టు కొట్టాలంటే ఎన్టీఆర్ తో సినిమా చేస్తేనే అది సాధ్యం అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడట. అవును మరి ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ మామూలుదా ..?

ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని సింహాద్రి రేంజ్ లో ఉన్న కథని సిద్ధం చేసుకున్నాడట. ఆ కథని ఎన్టీఆర్ ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్లకముందే ఆయనకి వినిపించేసాడట. శ్రీకాంత్ చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ కూడా బాగా నచ్చేసిందంట. అయితే సినిమా చేసేది లేనిది ఇంకా ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వలేదట. బహుశా యూరప్ ట్రిప్ నుంచి వచ్చాక దీనిపై ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శ్రీకాంత్ అడ్డాల మాత్రం చాల నమ్మక్కమ్ గా ఉన్నాడు తాను తాయారు చేసుకున్న స్టోరీ లో ఎన్టీఆర్ తప్ప నేను ఎవరిని ఊహించుకోలేనని, తారక్ ని ఊహించుకునే ఆ కథ సిద్ధం చేసుకున్నానని చెప్పుకొస్తున్నాడు
తారక్ కనుక ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్తే మరో మాస్ చిత్రంలో ఎన్టీఆర్ సందడి చేస్తాడన్నమాట.

Leave a comment