ఎన్టీఆర్ రేంజ్ కాదు.. కాని నాని తక్కువోడేం కాదు..

big-boss-remunaration
స్టార్ మా ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రియాలిటీ షో బిగ్ బాస్. బాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది అంటే అది తెలుగులోనే.. అది కూడా ఎలాంటి డౌట్లు లేకుండా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ షో చేయడమే. బుల్లితెర మీద స్టార్ హీరో అది కూడా నేటితరం స్టార్.
బిగ్ బాస్ మొదట్లో అందరికి చాలా డౌట్లు వచ్చాయి. కాని ఆ డౌట్లన్నిటిని పటాపంచలు చేసి షో ని సక్సెస్ ఫుల్ గా రన్ చేశాడు ఎన్.టి.ఆర్. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ వల్ల గ్రాండ్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. ఈ సీజన్ కు ఎన్.టి.ఆర్ చేయాల్సి ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ అయ్యేట్టు కనబడట్లేదు.
అందుకే నాచురల్ స్టార్ నానిని బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు సంప్రదించారు స్టార్ మా నిర్వాహకులు. మొన్నామధ్య ఇంటర్వ్యూలో చెప్పి చెప్పక చెప్పిన నాని తానే హోస్ట్ అని లీక్ చేశాడు. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే తారక్ రేంజ్ ను బట్టి 7 కోట్లు ఇవ్వగా ఇప్పుడు నానికి 3.5 కోట్లు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారట. రెండు నెలలు అది కూడా 20 రోజుల డేట్స్ కు మూడున్నర కోట్లన్నమాట. ఎన్.టి.ఆర్ తో పోల్చకుండా చూస్తే నాని ఇమేజ్ కు స్టార్ మా ఇచ్చిన ఆఫర్ చాలా పెద్దదని చెప్పొచ్చు.

Leave a comment