ఆనందంలో నందమూరి కుటుంబం కారణం అదే..!

balayya and ntr

ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై నందమూరి కుటుంబం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ అవార్డుల్లో నందమూరి కుటుంబానికి చెందిన ముగ్గురు నటులకు ఈ అవార్డులు దక్కడంతో ట్విట్టర్ వేదికగా వారి ఆనందాన్ని పంచుకున్నాడు ఓ నందమూరి హీరో.

నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపిక కాగా మాస్టర్ ఎన్టీఆర్ ఉత్తమ బాల నటుడిగా గుర్తింపు పొందాడు. దీంతో నందమూరి కళ్యాణ్ రామ్ ఆనందపడుతూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా మాస్టర్ ఎన్టీఆర్‌కి, బాబాయ్ బాలకృష్ణకు, సోదరుడు ఎన్టీఆర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ‘మా కుటుంబానికి ఎంతో గర్వపడే సందర్భం ఇది’ అని కళ్యాణ్ రామ్ ట్విట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి నంది అవార్డులను ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఉత్తమ చిత్రాలు, నటీనటుల వివరాలను ప్రకటించింది. అయితే ఇందులో 2014 కు గాను ఉత్తమ చిత్రం అవార్డును లెజెండ్ సినిమాకు రాగా ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. మరోవైపు 2016 కు గాను ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రకటించారు.

నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాల్లో ఎన్టీఆర్ నటనకు గాను ఈ అవార్డు అతన్ని వరించింది. కాగా నందమూరి ఫ్యామిలిలోని మాస్టర్ ఎన్టీఆర్‌కి కూడా ఈ అవార్డుల్లో స్థానం లభించింది. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా మాస్టర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు.
నందమూరి కుటుంబానికి ఇన్ని అవార్డులు రావడంపై అభిమానులుకూడా ఆనందంలో మునిగితేలుతున్నారు.

Leave a comment