భరత్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ ఏం మాట్లాడతాడో..!

ntr-in-bharat-event

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఎల్బి స్టేడియంలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిందే. భరత్ బహిరంగ సభకు ప్రేమతో ఎన్.టి.ఆర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వేడుకలో ఎన్.టి.ఆర్ స్పెషల్ అప్పియరెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇద్దరు స్టార్లు ఒకే వేదిక మీద కనిపించడం చాలా అరుదు. అయితే ఈ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అన్న దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. మహేష్ అంటే ఎప్పుడు తన అభిమానం చూపించే తారక్ ఏదైనా కొత్త విషయాన్ని చెబుతాడా అని ఆడియెన్స్ ఊహిస్తున్నారు.

తప్పకుండా ఈ ఇద్దరి కలయిక ఇండస్ట్రీలో మరింత మంచి రోజులు వస్తున్నట్టే. కొరటాల శివ సన్నిహితుడు కాబట్టి ఆయన డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న సినిమా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. కచ్చితంగా ఇది నందమూరి ఫ్యాన్స్ కు కూడా చాలా విశేషమైన రోజని చెప్పొచ్చు.

Leave a comment